డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ONGC డ్రిల్లింగ్ బావి వద్ద గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ లీకేజీ ప్రభావిత ప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
మామిడికుదురు మండలం నాగారం గ్రామ సమీపంలోని తాడివారిమెరక వద్ద జరిగిన ఈ Gas Leak Incident నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. సమీప గ్రామాల ప్రజలను గుర్తించి, అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్యాస్ లీకేజీ ప్రాంతంలో ప్రజలు గుమిగూడకుండా పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. ONGC Gas Leak నేపథ్యంలో స్థానిక ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment