బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో సుమన్ (24), సురేష్ (25), పవన్ (25) అనే ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ దుర్ఘటన మరోసారి పారిశుద్ధ్య కార్మికుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. కార్మికులకు సరైన భద్రతా పరికరాలు అందిస్తున్నారా? ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కార్మికుల ప్రాణాలకు భరోసా ఎప్పుడు?

తాజా వార్తలు, బ్రేకింగ్ అప్డేట్స్, ప్రత్యేక విశ్లేషణల కోసం మా ఛానల్‌ను SUBSCRIBE చేయండి.

మీ సందేశ్ టీవీ.. ప్రతి మాట విలువైనది.. ప్రతి దృశ్యం అరుదైనది!

Watch The Video