బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ టీవీ Quiz Show Kaun Banega Crorepati Season 18 (KBC 18)కు తాత్కాలిక విరామం ఏర్పడింది. కొత్త ఎపిసోడ్స్ ప్రసారం నిలిపివేసిన ఛానల్, ప్రస్తుతం గతంలో ప్రసారమైన పాత ఎపిసోడ్స్‌ను మళ్లీ Telecast చేస్తోంది. ఈ పరిణామంతో KBC అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి, షూటింగ్ Scheduleకు సంబంధించిన అంశాల కారణంగా ఈ Break ఏర్పడినట్లు వివిధ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ విరామం ఆరోగ్య సమస్యల వల్ల కాదని, అమితాబ్ Dates అందుబాటులో లేకపోవడమే కారణమని మరో కథనంలో పేర్కొన్నారు. India Today కథనం ప్రకారం ఆయన Seasonal Flu నుంచి కోలుకుంటున్నారు.

ప్రేక్షకులకు Sony LIV ద్వారా నవంబర్ 16 నుంచి KBC 18 కొత్త ఎపిసోడ్స్ తిరిగి ప్రసారం కానున్నట్లు సమాచారం అందింది. దీంతో అభిమానులు మరోసారి తమ అభిమాన హోస్ట్ అమితాబ్ బచ్చన్‌ను కొత్త ఎపిసోడ్స్‌లో చూడనున్నారు. అప్పటివరకు పాత ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను అలరించనుంది KBC టీమ్.