బాలీవుడ్ సూపర్‌స్టార్ Shah Rukh Khan తన 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందించారు. తన upcoming movie King నుంచి తొలి పాట **'Tu Mil Jaaye'**ను నవంబర్ 2న విడుదల చేశారు. ఈ పాట విడుదలతో సోషల్ మీడియాలో SRK అభిమానుల్లో సందడి మొదలైంది. షారుఖ్ ఖాన్, Deepika Padukone మధ్య కనిపించిన రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ పాటలో మరో ప్రత్యేక ఆకర్షణ ప్రముఖ బ్రిటిష్ సింగర్ Ed Sheeran భాగస్వామ్యం. ఆయనతో పాటు Arijit Singh, Madhubanti Bagchi తమ గాత్రాన్ని అందించారు. Sachin-Jigar ఈ పాటకు సంగీతం అందించగా, Ed Sheeran ప్రత్యేకంగా English Rapను కూడా అందించారు. దీంతో Bollywood, International Music కలయికగా ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Ed Sheeran తన Instagram ద్వారా ఈ Collaboration వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. ముంబైలోని Shah Rukh Khan నివాసం Mannatకు వెళ్లిన సమయంలో ఆయనకు Sachin-Jigar పరిచయం అయ్యారని, అదే రాత్రి 'Tu Mil Jaaye' కోసం తన భాగాన్ని రికార్డ్ చేశానని తెలిపారు. ఇక Siddharth Anand దర్శకత్వంలో తెరకెక్కుతున్న King సినిమా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment