నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత.. సూపరింటెండెంట్ తీరుపై నర్సింగ్ సిబ్బంది ధర్నా
(English)
Tension prevailed at the Nalgonda Government Hospital as nursing staff staged a massive protest in front of the Superintendent's office. The protesting nurses raised serious concerns, stating that there are no basic facilities like drinking water and proper washrooms for them inside the hospital. They slammed the hospital administration for utter failure and alleged that instead of fixing issues, authorities are issuing arbitrary memos blaming the nursing staff. Watch the video for complete details on the nurses' emotional outburst against high-handed actions.
(Telugu)
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తాగునీరు, వాష్‌రూమ్స్ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, తమపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మెమోలు జారీ చేస్తున్నారని నర్సులు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.