హైదరాబాద్ నగరంలో పాదచారుల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (HUMTA) నగరవ్యాప్తంగా 120 ప్రాంతాలను గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో Skywalks, Foot Over Bridges (FOBs), ఇతర Pedestrian Facilities ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా పాదచారులు రోడ్లు దాటేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన జంక్షన్ల వద్ద ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు HUMTA ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటి ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు పాదచారులకు సురక్షితమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే హైదరాబాద్లో Pedestrian Infrastructure మరింత మెరుగుపడే అవకాశం ఉంది. Skywalks, Foot Over Bridges నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు రోడ్లు దాటడం సులభతరం కానుంది. ఈ 120 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment