హైదరాబాద్ గోల్కొండలోని సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంతంలో సొరంగం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

18 సీడీ ప్రాంతంలోని చారిత్రక కట్టడాల సమీపంలో అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణల మధ్య ఈ సొరంగం బయటపడింది.

🔹 సొరంగం ఎక్కడికి వెళ్తుంది?
🔹 ఇది కుతుబ్షాహీ కాలానికి చెందినదేనా?
🔹 దీని నిర్మాణం ఎప్పుడు జరిగింది?
🔹 అక్రమ తవ్వకాల వెనుక అసలు కారణం ఏంటి?

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో ప్రస్తుతం అక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. సొరంగం అసలు చరిత్రను తెలుసుకునేందుకు ASI అధికారులు పరిశీలన చేయనున్నారు.

అధికారుల పరిశీలన తర్వాతే ఈ సొరంగం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడే అవకాశం ఉంది. 

Watch The Full Video