గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో మరో భారీ కూల్చివేత.. నేలమట్టమైన 7 అంతస్తుల మెన్స్ హాస్టల్ | #hydraa  

Telugu:
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) మరోసారి తన ప్రతాపం చూపించింది. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఏకంగా 7 అంతస్తుల మెన్స్ హాస్టల్‌ను అధికారులు నేలమట్టం చేశారు. ఇప్పటికే పక్కనే ఉన్న మరో నిర్మాణాన్ని తొలగించిన హైడ్రా, తాజాగా ఈ భారీ భవనంపై కూడా కొరడా ఝళిపించింది. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యల గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి.

English:
HYDRA has once again cracked down on unauthorized constructions, demolishing a massive 7-floor men's hostel in Anjaiah Nagar, Gachibowli, Hyderabad. Following previous actions in the area, authorities used heavy machinery to bring down the illegal structure while ensuring safety measures for nearby residents. Watch the full video to know more about HYDRA's ongoing operations against illegal buildings in Hyderabad.

Watch The Video