20 ఏళ్ల తర్వాత మీసేవ కార్మికులకు గుడ్‌న్యూస్ రూ.7 వేల వరకు పెరిగిన జీతాలుMeeSeva Workers Salary Hike

[Telugu]
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ షాపూర్‌నగర్‌లో గత 20 సంవత్సరాలుగా కనీస వేతనం లేక ఇబ్బందులు పడుతున్న మీసేవ కార్మికులకు ఊరట లభించింది. INTUC రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ చొరవతో, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 మందికి పైగా మీసేవ కార్మికులకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు జీతం పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ చిత్రపటాలకు కార్మికులు పాలాభిషేకం చేశారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి!

[English]
After 20 years of struggle, over 1,100 MeeSeva workers across Telangana have received a major relief with a salary hike of Rs. 6,000 to Rs. 7,000 per month following the intervention of Labour Minister Vivek Venkataswamy and INTUC State President Gunja Srinivas. Workers celebrated by performing 'Palabhishekam' to portraits of CM Revanth Reddy and Minister Vivek. Watch the full video for details on the implementation of the Minimum Wages Act.

Watch The Video