సైబరాబాద్లో నకిలీ వైద్యుల గుట్టురట్టు: ఏకకాలంలో 10 క్లినిక్లపై దాడులు, 10 మంది అరెస్ట్
అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల దందాను సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్చెరు, ఆర్సీ పురం ప్రాంతాల్లోని నకిలీ క్లినిక్లపై ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, వైద్య అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఎలాంటి వైద్య అర్హతలు, డిగ్రీలు లేకపోయినా.. కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో డాక్టర్లుగా చెలామణి అవుతున్న 10 మంది నకిలీ వైద్యులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. క్లినిక్లలో సెలైన్లు ఎక్కిస్తూ, గడువు ముగిసిన మందులు వాడుతున్న ఈ కేటుగాళ్ల గుట్టును కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రట్టు చేశారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఈ ప్రత్యేక కథనాన్ని వీక్షించండి.
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment