అభివృద్ధి పేరుతో పొలాలకు దారి లేకుండా చేస్తారా? - విజయనగరం కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన
విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటును తాము వ్యతిరేకించడం లేదని, కానీ అభివృద్ధి పేరుతో తమ పొలాలకు వెళ్లే రహదారిని తొలగించడం వల్ల వ్యవసాయం ఎలా చేయాలని వారు అధికారులను నిలదీశారు. ఇప్పటికే భూములు, ఆస్తులు కోల్పోయిన తమకు కనీసం పొలాలకు వెళ్లే మార్గం కూడా లేకుండా చేస్తే ఎలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రహదారిని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ కుటుంబాలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment