ఫ్లాండర్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం: 6 పతకాలతో వరల్డ్ నంబర్ 1 నిలిచిన హైదరాబాద్ బాలుడు భవిష్!
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశం గర్వించదగ్గ అరుదైన క్షణం! బెల్జియంలోని ఓస్టెండ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక 58వ ఫ్లాండర్స్ గ్రాండ్ ప్రిక్స్ ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన చిన్నారి చేవూరి భవిష్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచాడు. బాచుపల్లి సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న భవిష్, మినీమ్ బాయ్స్ (6-8 సంవత్సరాల) విభాగంలో పోటీపడి ఏకంగా 4 స్వర్ణాలు, 2 రజత పతకాలతో కలిపి మొత్తం 6 పతకాలను సొంతం చేసుకున్నాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో 8 పాయింట్లు సాధించి వరల్డ్ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుని దేశం తలఎత్తుకునేలా చేశాడు. బోరంపేట శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కేటింగ్ మరియు గూగులారారం ఆర్ఆర్ఎస్ఏ అకాడమీలో శిక్షణ పొందిన భవిష్ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment