మేడ్చల్ జిల్లా దూలపల్లిలో భారీ అగ్నిప్రమాదం 🔥
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఫాక్స్ సాగర్ ఆవరణలో మెడికల్ ఈ-వేస్ట్ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
గోదాంను అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదాంలో భారీగా మెడికల్ ఈ-వేస్ట్ నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? గోదాం నిర్వహణకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
📍 ప్రాంతం: దూలపల్లి, మేడ్చల్ జిల్లా
🚨 పోలీస్ స్టేషన్: పేట్ బషీరాబాద్
🔥 ఘటన: మెడికల్ ఈ-వేస్ట్ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment