292 డివిజన్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా BRS సీనియర్ నాయకుడు వారాల వినోద్ కుమార్ వరుసగా పలు కాలనీలు, బస్తీల్లో పర్యటించారు.

సాయిబాబా నగర్, సూరారం, తెలుగు తల్లి నగర్, కృషి కాలనీ ప్రాంతాల్లోని వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాల్లో స్థానికులు, మహిళలు, యువత, బస్తీ వాసులతో కలిసి పాల్గొన్నారు.

అదే సమయంలో అనారోగ్యంతో ఉన్న వారిని వారి నివాసాల్లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కృషి కాలనీ BRS ప్రెసిడెంట్ రామ్ రెడ్డిని కూడా పరామర్శించారు.

సూరారం కాలనీలో మహిళా CMC కార్మికులకు చీరలు పంపిణీ చేసి సత్కరించారు.

292 డివిజన్‌లో వినాయక ఉత్సవాల సందర్భంగా వారాల వినోద్ కుమార్ చేపట్టిన వరుస కార్యక్రమాలపై పూర్తి ప్రత్యేక కథనం.

Watch The Video