హతమార్చేందుకే స్కెచ్ వేశారా?కాంగ్రెస్ నేత నర్సారెడ్డి వీరారెడ్డిపై దాడి వెనుక అసలు నిజాలు

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్‌లో కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారవేత్త నర్సారెడ్డి వీరారెడ్డి లక్ష్యంగా సంచలన హత్యాయత్నం జరిగింది. జీపీఆర్ లేఔట్‌లోని ఆయన కార్యాలయం వద్దకు వచ్చిన గుర్తుతెలియని దుండగులు ముందుగా రెక్కీ నిర్వహించి, ఆయన ఆఫీసులో ఉండగానే కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఊహించని ఈ పరిణామాంతో అప్రమత్తమైన వీరారెడ్డి గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఈ దాడి వ్యాపార లావాదేవీల వల్ల జరిగిందా లేక ఎవరైనా పథకం ప్రకారం హతమార్చేందుకు స్కెచ్ వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Watch The Video