తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సమిష్టి కృషితో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాల్లో:

🔹 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు
🔹 హుండీ ద్వారా ₹28.94 కోట్ల ఆదాయం
🔹 సుమారు 33 లక్షల లడ్డూల విక్రయం
🔹 21.84 లక్షల అన్నప్రసాదాల పంపిణీ
🔹 2.04 లక్షల మంది తలనీలాలు సమర్పించారు
🔹 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు
🔹 సుమారు 60 టన్నుల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ
🔹 3,000 మంది పోలీసులు + 2,400 మంది విజిలెన్స్ సిబ్బంది భద్రతలో పాల్గొన్నారు
🔹 4,000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు

వాహనసేవలు, గరుడసేవ, పుష్పాలంకరణ, అన్నప్రసాదం, భద్రతా ఏర్పాట్లతో తిరుమలలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి.

Watch The Video