తెలంగాణ పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రవేశపెట్టిన Urban Challenge Fund (UCF) కింద రాష్ట్రానికి చెందిన ఐదు కీలక Urban Infrastructure Projects‌కు ఆమోదం లభించింది. ఇందులో హైదరాబాద్‌కు గోదావరి తాగునీటి సరఫరా, వరంగల్ నగరంలో Stormwater Drainage అభివృద్ధి, హనుమకొండలో Central Business District (CBD) ఏర్పాటు, చారిత్రక వరంగల్ కోట అభివృద్ధి, అలంపూర్ Heritage and Tourism Revival వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టుల్లో ప్రధానమైనది హైదరాబాద్‌కు గోదావరి నీటిని తరలించే Godavari Drinking Water Supply Project Phase II & III. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు ₹1,992 కోట్లు. అలాగే గ్రేటర్ వరంగల్‌లో Stormwater Drainage వ్యవస్థను ఆధునీకరించేందుకు ₹1,465 కోట్లు కేటాయించారు. వరంగల్ కోట కందకం పునరుద్ధరణకు ₹209 కోట్లు, హనుమకొండ CBD అభివృద్ధికి ₹169 కోట్లు, అలంపూర్ ఆలయ పట్టణంలో Heritage and Tourism Development కోసం ₹57.5 కోట్లు ఆమోదించారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్‌లో Drinking Water Supply మెరుగుపడటంతో పాటు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో Drainage, Urban Infrastructure అభివృద్ధి చెందనున్నాయి. అలంపూర్‌లో పర్యాటక రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, Urban Local Bodies సహకారంతో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. తెలంగాణలో పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.