దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy – SMAT 2026)లో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వేదికల్లో Elite Group మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టీ20 ఫార్మాట్లో సాగుతున్న ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల జట్లు తదుపరి దశకు అర్హత సాధించేందుకు పోటీపడుతున్నాయి.
గురువారం (నవంబర్ 26) ఏడో రౌండ్లో భాగంగా పలు కీలక మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) జట్టు ఒడిశా (Odisha)తో మధ్యాహ్నం 1:30 గంటలకు తలపడనుంది. కేరళ (Kerala) జట్టు హిమాచల్ ప్రదేశ్‌తో ఉదయం 11 గంటలకు ఆడనుండగా, జార్ఖండ్ (Jharkhand) జట్టు చండీగఢ్‌తో మధ్యాహ్నం 1:30 గంటలకు పోటీపడనుంది.
ఈ గ్రూప్ దశలో ప్రతి జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 26తో Elite Group League దశ ముగియనుండగా, నవంబర్ 30 నుంచి Super League మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 6న ఫైనల్ జరగనుంది. దీంతో తదుపరి దశకు చేరుకునే జట్లపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment