క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన 2018 Sandpapergate వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ (Cameron Bancroft) సంచలన విషయాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో Ball Tampering వ్యవహారంపై Cricket Australia నిర్వహించిన విచారణ సమయంలో తాను పూర్తి నిజాలు వెల్లడించలేదని అంగీకరించారు. తన సహచర ఆటగాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టకూడదనే ఉద్దేశంతో కీలక వివరాలను దాచినట్లు తెలిపారు.

బాన్‌క్రాఫ్ట్ తన తాజా కథనంలో ఈ వ్యవహారం గురించి అప్పట్లో కేవలం తాను, డేవిడ్ వార్నర్ (David Warner), స్టీవ్ స్మిత్ (Steve Smith) మాత్రమే తెలుసుననే వాదన సరైంది కాదని పేర్కొన్నారు. మొత్తం ఆస్ట్రేలియా జట్టుకు ఈ విషయం తెలుసని ఆరోపించారు. Sandpaper ఉపయోగించడం ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతకాలం కొనసాగింది, ఇతర ఆటగాళ్లకు ఎంతవరకు అవగాహన ఉందనే కీలక విషయాలను విచారణలో వెల్లడించలేదని తెలిపారు. ఇటీవల ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) తన Autobiographyలో చేసిన వ్యాఖ్యలకు బాన్‌క్రాఫ్ట్ వెల్లడించిన విషయాలు మరింత బలం చేకూర్చాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఈ వివాదంపై పూర్తి స్థాయి బహిరంగ విచారణ జరగాలని కోరుతున్నారు. మరోవైపు Cricket Australia పాత విచారణను తిరిగి ప్రారంభించబోమని ప్రకటించినప్పటికీ, ఆటగాళ్లు తమ వాదనలు వినిపించేందుకు Independent Forum ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ Forum ద్వారా వెల్లడయ్యే వివరాలను బహిరంగంగా విడుదల చేస్తారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో Sandpapergate వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.