కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా సుమారు రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 Major Development Projectsకు శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో కొడంగల్ ప్రాంతంలో Infrastructure, Education, Agriculture, Road Connectivity రంగాలకు కొత్త ఊపు రానుంది.

ఈ ప్రాజెక్టుల్లో Kotwalguda–Nacharam Radial Road-2 అత్యంత కీలకమైనది. సుమారు రూ.5,060 కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి Outer Ring Road సమీపంలోని కొత్వాల్‌గూడ నుంచి నాచారం వరకు కనెక్టివిటీని మెరుగుపరచనుంది. అలాగే లగచర్ల Industrial Corridorలో రూ.81 కోట్లతో Eco-Palm Oil Factory, రూ.2,100 కోట్లతో MNKLIS రెండో దశ, రూ.1,410 కోట్లతో 223 BT Roads పనులు చేపట్టనున్నారు. కొడంగల్‌లో Agriculture College, 10 Telangana Public Schools ఏర్పాటు కూడా ఈ Development Packageలో ఉన్నాయి.

కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పలు Government Buildingsను సీఎం ప్రారంభించనున్నారు. సుమారు రూ.46.08 కోట్లతో నిర్మించిన 10 ప్రభుత్వ భవనాల్లో విద్యాసంస్థలు, Primary Health Centres, Police Stations, Government Offices వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కొడంగల్ ప్రాంతంలో రవాణా, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలకు మరింత మెరుగైన అవకాశాలు ఏర్పడనున్నాయి.