ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు చెందిన బకాయిల వ్యవహారంపై నిర్మాణ సంస్థ Eclatant Films Private Limited రూ.29.67 కోట్ల రికవరీ నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం 2010 ఏప్రిల్ 10న కుదిరిన ఒప్పందానికి సంబంధించినదిగా సంస్థ పేర్కొంది. ఇందులో అసలు బకాయిలతో పాటు సుమారు రూ.11.38 కోట్ల వడ్డీ కూడా ఉన్నట్లు వెల్లడించింది.

ఈ వివాదం నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు (Business Transactions) నిర్వహించాలన్నా ముందుగా తమ నుంచి రాతపూర్వక అనుమతి (No Objection Certificate – NOC) తీసుకోవాలని Eclatant Films సినీ పరిశ్రమకు హెచ్చరిక జారీ చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బ్రాడ్‌కాస్టర్లు, OTT ప్లాట్‌ఫామ్‌లు తమ అనుమతి లేకుండా ఆయన సినిమాలకు సంబంధించిన హక్కుల కొనుగోలు, పంపిణీ లేదా Streaming Deals చేయవద్దని సూచించింది.

అక్టోబర్ 30, 2026లోగా బకాయిలు చెల్లించాలని సంస్థ గతంలో గడువు విధించినట్లు సమాచారం. చెల్లింపులు జరగకపోతే ఒప్పంద పరిధిలోకి వచ్చే సినిమాలపై తనకు ఉన్న Contractual Rights, Revenue Shares, Exploitation Rights విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ పేర్కొంది. మరోవైపు ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ నుంచి ఇప్పటివరకు బహిరంగ స్పందన వెలువడలేదు. దీంతో బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ ఆర్థిక వివాదం చర్చనీయాంశంగా మారింది.