🚨 *కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫ్లాట్లలో మంటలు!*
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నయాన్ ఇన్ఫ్రా అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నాలుగో అంతస్తులో ఎదురెదురుగా ఉన్న రెండు ఫ్లాట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, పూజా మందిరం వద్ద వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.
మంటల తీవ్రత పెరగడంతో గ్యాస్ సిలిండర్లు, ఏసీ కంప్రెషర్లు పేలినట్లు సమాచారం. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనలో సుమారు రూ.25 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
⚠️ చిన్న నిర్లక్ష్యం.. భారీ ప్రమాదానికి దారితీయొచ్చు. దీపాలు వెలిగించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.
మరిన్ని తాజా వార్తల కోసం **సందేశ్ టీవీ**ని Subscribe చేయండి.
🔔 తాజా వార్తల కోసం Bell Icon నొక్కండి.
Watch The Video
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment