స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక బహుమతులు అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన Swiss Cheese కు దీటుగా భారత్‌లో తయారైన అవార్డ్ విన్నింగ్ చీజ్‌లు 'గుల్మార్గ్‌', 'కోణార్క్', 'యూర్‌' లతో పాటు అద్భుతమైన కశ్మీరీ వాల్ ప్యానెల్‌ను ఆయన బహూకరించారు.

ముంబైకి చెందిన ప్రఖ్యాత Eleftheria Cheese క్రీమరీలో తయారైన ఈ ప్రత్యేక చీజ్‌లు అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలను గెలుచుకున్నాయి. ఫ్రెంచ్-స్టైల్ Brie Cheese అయిన 'గుల్మార్గ్‌' బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో Super Gold Award గెలుచుకోగా, ఫ్రెంచ్ టోమ్-స్టైల్ 'కోణార్క్' మరియు స్విస్ గ్రూయేర్ స్పూర్తితో తయారైన 'యూర్' చీజ్‌లు విదేశీ వేదికలపై భారతదేశ డెయిరీ సెక్టార్ ఘనతను చాటాయి.

భారతదేశ సాంప్రదాయ హస్తకళలను, అభివృద్ధి చెందుతున్న Artisanal Dairy Sector ను ప్రపంచానికి పరిచయం చేసేలా సాగిన ఈ Gift Diplomacy విశేషాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ ప్రత్యేక కానుకల వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను Sandesh TV లో పూర్తి వివరాలతో వీక్షించండి!

Watch The Video