నేటి యువతకు శ్రీకృష్ణుడు అసలు ఏం చెబుతున్నాడు? గోకులాష్టమి స్పెషల్ లైఫ్ లెసన్స్
గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీకృష్ణుడి జీవితాన్ని కేవలం దేవుడిగా కాకుండా నేటి యువతకు మార్గదర్శిగా నిలిచిన గొప్ప గురువు కోణంలో ఈ ప్రత్యేక వీడియో విశ్లేషిస్తుంది. వెన్న దొంగిలించడం వెనుక ఉన్న అసలు అర్ధం సోషల్ మీడియా ఫాలోవర్ల కంటే మనసులను గెలుచుకోవడం అని, వేణువు నాదం ఇతరులతో పోటీపడకుండా మనతో మనం పోటీ పడాలని నేర్పుతుందని ఈ వీడియోలో వివరించడం జరిగింది. అలాగే గోవర్ధనగిరి ఎత్తడం ద్వారా టీమ్‌వర్క్ ప్రాముఖ్యతను, కురుక్షేత్రంలో అర్జునుడి గందరగోళానికి భగవద్గీత ద్వారా కృష్ణుడు ఇచ్చిన పరిష్కారాలను నేటి ఉద్యోగ, కెరీర్ ఒత్తిడి ఎదుర్కొంటున్న యువతకు అన్వయించి అద్భుతమైన జీవన పాఠాలను అందించడమైనది.