ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కంపెనీ CEO కల్యాణ్ కృష్ణమూర్తి (Kalyan Krishnamurthy) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. IPO (Initial Public Offering) ప్రక్రియలో ఆలస్యం, సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ నిష్క్రమణ వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

కల్యాణ్ కృష్ణమూర్తి నిష్క్రమణ నేపథ్యంలో కంపెనీ తాత్కాలిక బాధ్యతలను CPTO బాలాజీ త్యాగరాజన్ (Balaji Thiagarajan) పర్యవేక్షించే అవకాశం ఉంది. ఈ మార్పులపై Flipkart Board కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే CEO మార్పుపై అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

ఇప్పటికే భారత ఈ-కామర్స్ మార్కెట్‌లో Amazon వంటి సంస్థల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న Flipkartకు ఈ పరిణామాలు కీలకంగా మారనున్నాయి. IPO ద్వారా Stock Marketలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న సమయంలో నాయకత్వ మార్పు సంస్థ భవిష్యత్తు వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.