సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. ఉదయం అల్పాహారంగా అందించిన పులిహోర తిన్న తర్వాత పలువురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

తమకు పురుగులు ఉన్న అన్నం పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థినులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అధికారులు హాస్టల్ వంటగదిని తనిఖీ చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం. మంత్రి దామోదర రాజనర్సింహ కూడా స్పందించి నివేదిక కోరినట్లు వార్తలు వచ్చాయి.

అసలు జోగిపేట హాస్టల్‌లో ఏం జరిగింది? విద్యార్థినులకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉందా? ఈ ఘటనకు బాధ్యులెవరు?

తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ విశ్లేషణల కోసం STV News ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.

Watch The Video