తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న Invest Telangana Global Summit 2026 కోసం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ మూడు రోజుల సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులను ఈ Summit కు ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలను ఆకర్షించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

అయితే, రాష్ట్రంలో నెలకొన్న కరువు, నీటి కొరత, విద్యుత్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మిట్‌ను వాయిదా వేయాలని పలు Resident Welfare Associations (RWAs), తెలంగాణ NRI సంఘాలు, పౌర సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రాష్ట్రంలోని 365 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ, సమ్మిట్ నిర్వహణకు కేటాయించే నీరు, విద్యుత్, ప్రజాధనం, అధికారుల వనరులను ప్రజల అవసరాలకు వినియోగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సమ్మిట్ నిర్వహణపై ముందుకు సాగుతోంది. ఈసారి ఆరు Exhibition Halls, 52 Sector-specific Sessions, Startup Pavilion, Pharma and Life Sciences Expo, Raksha Expo వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణను Global Investment Destination గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమ్మిట్ నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం, వాయిదా కోరుతున్న సంఘాల డిమాండ్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.