న్యూజిలాండ్‌తో జరిగిన రెండో ODIలో టీమిండియా ఉత్కంఠభరిత విజయం సాధించింది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్‌లో DLS Method ద్వారా భారత్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల ODI Seriesలో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి 134 పరుగులకే All Out అయింది. భారత యువ పేసర్ గుర్నూర్ బ్రార్ 4 Wickets తీసి ఆకట్టుకోగా, ఆకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ 55 పరుగులతో Top Scorerగా నిలిచాడు.

135 పరుగుల Targetతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు, KL రాహుల్ అజేయంగా 26 పరుగులతో జట్టును ఆదుకున్నారు. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 26 ఓవర్లలో 113/7 స్కోరు చేసింది. DLS Par Score 109 కావడంతో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.