హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై HYDRAA మరోసారి భారీ చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్ ప్రహరీ గోడ, ప్రధాన గేటును అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. దూలపల్లి గ్రామంలోని ఫామ్‌హౌస్ వద్ద ఈ చర్యలు చేపట్టారు. ఫాక్స్ సాగర్ చెరువు Full Tank Level (FTL) పరిధిలో నిర్మాణాలు ఉన్నాయనే కారణంతో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు HYDRAA అధికారులు వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం, Survey Number 124 పరిధిలోని ఫామ్‌హౌస్ ప్రహరీ గోడ ద్వారా దాదాపు 15 ఎకరాల ఫాక్స్ సాగర్ FTL భూమిని ఫామ్‌హౌస్ పరిధిలోకి తీసుకున్నట్లు గుర్తించారు. చెరువు FTL, Buffer Zone ప్రాంతాల్లో మట్టిని పోసి భూమిని ఎత్తు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాంపౌండ్ వాల్, గేటుతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన Iron Fencingను కూడా తొలగించారు.
మరోవైపు జీడిమెట్లలోని Survey Numbers 41, 42 పరిధిలో దాదాపు 20 ఎకరాల చెరువు FTL భూమికి సంబంధించిన ప్రహరీ గోడలను కూడా HYDRAA తొలగించింది. మొత్తం సుమారు 35 ఎకరాల ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఫాక్స్ సాగర్ చెరువును పునరుద్ధరించడం, ఆక్రమణలను తొలగించడం, నీటి వనరులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments (0)
No comments yet. Be the first to comment.
Leave a comment