హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్ ఘటన విషాదాన్ని నింపింది.

గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న **కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ కె. వెంకన్న (55)**ను గుర్తుతెలియని బైక్ ఢీకొట్టి వెళ్లిపోయినట్లు సమాచారం.

ట్యాంక్ బండ్ క్రేన్ నంబర్-2 సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఎస్ఐ వెంకన్నను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని బైక్‌ను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా భక్తులు, వాహనాలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Watch The Video