దుండిగల్ దోపిడీ కేసులో కీలక పరిణామం.. 2.1 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం

హైదరాబాద్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 16, 2026న జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి బాత్‌రూమ్‌లో నిర్బంధించి, నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న దుండిగల్ పోలీసులు, CCS కుత్బుల్లాపూర్ జోన్ పోలీసులతో కలిసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
🔹 నిందితుల వద్ద నుంచి సుమారు 2.1 కిలోల వెండి ఆభరణాలు
🔹 ఇన్నోవా కారు స్వాధీనం
🔹 ఐదుగురు నిందితులు రిమాండ్‌కు తరలింపు
🔹 మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు
అరెస్టైన నిందితులు: కొనేంగి అనిల్ కుమార్, అమట్టి రమేష్, దేవగత్ రవి, కొరపతి చిన్న సాయి, ఫార్సా రామ్ రణ్.
పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తు మరియు ఏసీపీ శంకర్ రెడ్డి ప్రెస్‌మీట్ వివరాలను ఈ వీడియోలో చూడండి.
Disclaimer: ఈ వీడియోలోని నేరానికి సంబంధించిన వివరాలు పోలీసుల ప్రకటన/ప్రెస్‌మీట్ ఆధారంగా అందించబడుతున్నాయి. నిందితులపై ఆరోపణలు కోర్టులో తుది తీర్పు వచ్చే వరకు ఆరోపణలుగానే పరిగణించాలి

Watch The Video