విశాఖపట్నంలో జరుగుతున్న 31వ CII Partnership Summit 2026 వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని Trusted Global Investment Hubగా అభివర్ణిస్తూ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడుల ఆహ్వానం పలికారు. రాష్ట్రంలో Political Stability, Transparent Governance, Infrastructure, Green Energy వంటి అవకాశాలను వివరించారు.

ఈ సదస్సులో పెట్టుబడులకు సంబంధించి భారీ ఒప్పందాలు కుదిరాయి. తొలి రోజు 73 Memorandums of Understanding (MoUs), 15 Government Orders ద్వారా మొత్తం రూ.5,84,355 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా సుమారు 1,07,693 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. Manufacturing, Renewable Energy, Automobile, IT, Electronics, Infrastructure రంగాలకు సంబంధించిన పెట్టుబడులు ఇందులో ఉన్నాయి.

పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఏపీలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. పవన్ కల్యాణ్ సైతం రాష్ట్రంలోని అవకాశాలను ప్రపంచ స్థాయిలో పరిచయం చేశారు. రెండు రోజుల CII Summit ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి.