కన్నకూతురు తిరిగి వస్తుందన్న ఆశను ఆసరాగా చేసుకుని ఓ కుటుంబాన్ని ఏకంగా రూ.50 లక్షలకు మోసం చేసిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో బాధలో ఉన్న కుటుంబాన్ని కొందరు వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాంత్రిక పూజలు, ప్రత్యేక క్రతువులు నిర్వహిస్తే కుమార్తె తిరిగి వస్తుందని నమ్మించి విడతలవారీగా రూ.50 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తిని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కీసర పోలీసులు ప్రధాన నిందితుడు క్రాంతి కుమార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.25,02,500 నగదు, బంగారు ఉంగరం, సుమారు 50 తులాల వెండి బిస్కెట్ ముక్కలు, ఏటీఎం కార్డు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రజలకు విజ్ఞప్తి: కుటుంబ సమస్యలు, వ్యక్తిగత బాధలను ఆసరాగా చేసుకుని తాంత్రిక పూజల పేరుతో డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మూఢనమ్మకాలకు బలికాకండి. బెదిరింపులు, మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించండి.

WATCH THE VIDEO