తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను భౌతికంగా అంతమొందించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ చావును కోరుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో hot topicగా మారాయి.
షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌పై దాడులు చేస్తామని, ‘చావు డప్పు’ కొడతామని బహిరంగంగా వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరమని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యాఖ్యలు కాదని, దీని వెనుక Chief Minister Revanth Reddy’s thinking ఉందని ఆయన విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతల తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.
కేసీఆర్ చావు గురించి మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డి unconditional apology చెప్పాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేసి, చట్టపరంగా strict action తీసుకోవాలని కోరారు. ఈ ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరిన నేపథ్యంలో, ఇరుపక్షాల స్పందనలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Watch The Video