చిరు వ్యాపారులపై దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లు: Street Food Vendors Expose Extortion in Hyderabad
హైదరాబాద్‌లోని ప్రముఖ కోహినూర్ రోడ్డు (ITC కమ్యూనిటీ రోడ్డు) వద్ద చిరు వ్యాపారుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. పొట్టకూటి కోసం స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసుకుంటున్న తమపై అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 14 షెడ్లకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, కొత్త వ్యాపారుల నుంచి రూ.100 బాండ్ పేపర్లు రాయించుకుని, ఫోన్‌పే ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారంటూ బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. గంగారామ్ అనే వ్యక్తితో పాటు సంబంధిత వ్యవహారంపై కోర్టు పత్రాలు, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు మౌనం వహించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్ ఎ. భాను చారి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రావణి సంఘీభావం తెలిపారు. అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి, పేద వ్యాపారుల ఉపాధికి భద్రత కల్పించాలని కోరుతున్న ఈ నిరసన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూడండి.
Watch The Video