హైదరాబాద్‌లోని HITEXలో 85వ వార్షిక Indian Roads Congress (IRC) సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దేశవ్యాప్తంగా రోడ్లు, హైవేల నిర్మాణ రంగానికి చెందిన ఇంజినీర్లు, నిపుణులు, పరిశోధకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆధునిక రహదారుల నిర్మాణం, Road Safety, Infrastructure Development, కొత్త టెక్నాలజీలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రణాళికలను వివరించారు. తెలంగాణను మూడు ప్రత్యేక Economic Regions‌గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో CURE (Core Urban Region Economy) పరిధిలో సేవారంగం, PURE (Peri Urban Region Economy) పరిధిలో Manufacturing, RARE (Rural Agriculture Region Economy) పరిధిలో వ్యవసాయం, Agro-Based Industries‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి Roads, Highways, Regional Ring Road (RRR), Industrial Connectivity, Infrastructure Development కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మెరుగైన రవాణా సౌకర్యాలతో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.