చెస్ ప్రపంచంలో 11 ఏళ్ల బాలిక బోధన శివానందన్ (Bodhana Sivanandan) చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మాస్టర్ (International Master – IM) టైటిల్‌ను సాధించేందుకు అవసరమైన అర్హతలను పూర్తి చేసి, చెస్ దిగ్గజం జుడిట్ పోల్గర్ (Judit Polgar) 38 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. దీంతో చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.

మాంటెనెగ్రోలోని బుడ్వాలో జరిగిన European Club Cup టోర్నమెంట్‌లో బోధన అద్భుత ప్రదర్శన చేసింది. చివరి రౌండ్‌లో స్వీడన్‌కు చెందిన విక్టోరియా జోహాన్సన్ (Viktoria Johansson)పై విజయం సాధించి తన మూడో, చివరి IM Normను పూర్తి చేసింది. ఏడు గేమ్స్‌లో 5.5 పాయింట్లు సాధించి, తన రేటింగ్‌ను 2400 దాటించింది. కేవలం 11 సంవత్సరాల 7 నెలల వయసులో ఈ ఘనత సాధించడం ప్రపంచ చెస్ రంగంలో విశేషంగా నిలిచింది.

గతంలో హంగేరీకి చెందిన చెస్ దిగ్గజం జుడిట్ పోల్గర్ 1988లో 12 ఏళ్ల వయసులో ఈ రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు బోధన ఆ రికార్డును అధిగమించడమే కాకుండా, ప్రపంచంలోని అతి పిన్న వయస్కులైన International Masters జాబితాలో ఏడో స్థానానికి చేరుకుంది. భవిష్యత్తులో Grandmaster టైటిల్ సాధించడమే తన తదుపరి లక్ష్యమని బోధన తెలిపింది. ఈ చిన్నారి ప్రతిభపై చెస్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరిన్ని Chess Updates, Sports News కోసం Sandesh TV Telugu ఛానల్‌ను Subscribe చేసుకోండి.